భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకు బహుమతిగా మన దేశం అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ యుద్ధనౌకను ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి అప్పగించారు. సేవలందిస్తున్న ఓ యుద్ధనౌకను భారత్ తన మిత్ర దేశానికి బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని భారత నౌకాదళం వెల్లడించింది.