నరసరావుపేట పట్టణంలోని పలువురు వ్యాపారులకు ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్స్ కోసం మామూళ్లు చెల్లించాలని అజ్ఞాత వ్యక్తి డిమాండ్ చేస్తున్నారని వర్తక వాణిజ్య సంఘ నేతలు శనివారం డీఎస్పీ కేవీ మహేష్ కు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబరు, వాయిస్ రికార్డు అందజేశారు. ముగ్గురు వ్యాపారుల వద్ద పురపాలక సంఘ కమిషనర్ పేరుతో రూ. 4 వేలు ఫోన్ పే చేయించుకున్నట్లు చెప్పారు. నకిలీ కమిషనర్ పై చర్య తీసుకోవాలని కోరారు.