రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని భివాడీకి చెందిన అంజు(34), అర్వింద్ దంపతులు. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అంజుకు ఫేస్బుక్లో పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో అతడిని కలిసేందుకు అంజు పాక్‌కు వెళ్లింది. వాయువ్య పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లిన అంజును అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు.