కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దళిత బాలిక(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. లోకేష్ అనే యువకుడి ప్రేమలో పడింది. ఏకాంతంగా గడుపుదామని రమ్మని పిలిచాడు. అతడి వెంట వెళ్లిన బాలికను ఉయ్యూరులోని లాడ్జికి తీసుకెళ్లాడు. వరుసకు సోదరుడయ్యే నరేంద్రకు ఫోన్ చేసి పిలిచాడు. ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు బాలికపై అత్యాచారం చేశారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని లోకేష్, నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు.