టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు గన్మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. గత మూడు రోజులుగా కన్నా గన్మెన్లు విధులకు హాజరు కావడం లేదు. దీనిపై ఆరా తీయగా కన్నాకు భద్రతను ఉపసంహరించినట్టు తేలింది. అయితే మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్మెన్లను తొలగించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సమాచారం కూడా ఇవ్వకుండానే తొలగించారని విమర్శించారు.