ఏపీలో నేడు స్కూల్స్, కళాశాలల బంద్ చేపడుతున్నట్టు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (TNSF), AISF వెల్లడించాయి. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ బంద్ చేపడుతున్నట్టు స్పష్టంచేశాయి. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 53 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతున్నాయి.