స్వయం సహాయక సంఘాల సభ్యులు సామాజిక రుగ్మతలు నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. ఐ. కరుణ కుమార్ పిలుపు నిచ్చారు. సోమవారం జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.