దేశవాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ టాప్లో నిలిచింది. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తాజా నివేదిక ప్రకారం. మహిళలపై నేరాలకు సంబంధించి 2021లో 23,700 కేసులు నమోదు కాగా, 2022లో 30 శాతం పెరిగి 30,957 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయి. వీటిల్లో సగానికి పైగా 16,872(54.5 శాతం) ఫిర్యాదులు ఒక్క యూపీ నుంచే వచ్చాయి. రెండో స్థానంలో ఢిల్లీ ఉండగా, మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది.