యువకుడిపై ఉన్న పిచ్చి ప్రేమ మరో యువతిపై దాడి చేసేలా చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. రెస్టారెంట్ రంగ్లాలో శివాని, ఆశిష్ ఏడాదిగా పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అప్పుడే రీనా అనే యువతి రెస్టారెంట్లో చేరింది. రీనా.. ఆశిష్‌కు దగ్గరవ్వడాన్ని శివాని భరించలేకపోయింది. ఆదర్శనగర్‌లోని తన గదికి పిలిచి కత్తితో దాడి చేసింది. గాయపడిన రీనాను ఆస్పత్రికి తరలించారు.