అసోంలోని కచర్ జిల్లాలోని సిల్చార్ ప్రాంతంలో స్పెషల్ టాక్స్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వాహనాల తనిఖీలో భాగంగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారును అడ్డుకుని తనిఖీ నిర్వహించగా అందులో 2.5 కిలోల డ్రగ్స్, లక్ష యాబా ట్యాబెట్లు గుర్తించారు. డ్రగ్స్, కారును స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.45 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa