ఏపీలో ఈ నెల 28న జూనియర్ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది. జూనియర్ కాలేజీల్లో పరిష్కారం కోసమే ఈ బంద్ పాటిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఫీజుల పేరుతో దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్న కళాశాలల్లో వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. బంద్ కు సంబంధించిన పోస్టర్లను నెల్లూరులో ఆవిష్కరించారు.