గుంటూరులో కురుస్తున్న భారీ వర్షం వలన ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో ప్రజల ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ కీర్తి ఆదేశించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ. ఆయా ప్రాంతాల్లో సచివాలయాల వారీగా కార్యదర్శులు అందుబాటులో ఉండి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం కల్గితే త్రాగునీటి సరఫరాకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.