ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుండి 117 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం నేడు ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది.