మణిపూర్ లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది. కాగా, మణిపూర్ హింసపై గురువారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సీబీఐకు బదిలీ చేసినట్లు వెల్లడించిన కేంద్ర హోంశాఖ, ఈ కేసు ట్రయల్ కాలపరిమితి(6 నెలల గడువు)తో జరగాలని అఫిడవిట్ లో సుప్రీంను కోరింది.