భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా దిగువన గల పల్లపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. భారీ వర్షాలకు కృష్ణా నది క్యాచ్మెంట్ ఏరియాలోంచి వరద నీరు బ్యారేజీకి ఉధృతంగా వచ్చి చేరుతోందని, గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి 1, 51, 205 వ్యాసెక్కులు వచ్చినట్లు తెలిపారు