ఢిల్లీలోని మాల్వీయా నగర్ అరబిందో కాలేజీ సమీపంలోని పార్కులో శుక్రవారం దారుణం జరిగింది. నగ్రిస్ (25) అనే యువతికి ఇర్ఫాన్ అనే యువకుడు పెళ్లి ప్రతిపాదన చేశాడు. దానిని ఆమె కుటుంబం తిరస్కరించింది. దీంతో ఇర్ఫాన్‌తో నగ్రిస్ మాట్లాడడం మానేసింది. ఈ క్రమంలో కోచింగ్ తరగతులకు వెళ్తున్న ఆమెను ఇర్ఫాన్ పార్కుకు పిలిచాడు. అక్కడ ఆమె తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.