రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమావేశం చేపట్టారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతోపాటు, భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా ముఖ్యమంత్రి ఆరాతీశారు.