ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విన్యాసాల్లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లోని హామిల్టన్ ద్వీపంలో ఓ మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గల్లంతయ్యారని రక్షణశాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa