తిరుచ్చి విమానాశ్రయంలో 47 కొండచిలువలు కలకలం రేపాయి. కౌలాలంపూర్ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో 47 పాములు, రెండు బల్లులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు మహమ్మద్ మొయిద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాటిల్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగా అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడు మొయిద్దీన్ అడ్డుకున్నారు. బ్యాగ్‌లను తనిఖీ చేయగా కొండచిలువలు కనిపించాయి.