రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన అంటూ క్రొత్త డ్రామాకి చంద్రబాబు తెర లేపారు అని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తన కుప్పం నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించలేని చంద్రబాబు.. ఏ అర్హత ఉందని వస్తున్నారో తెలపాలన్నారు. చంద్రబాబుకు రాయలసీమ ప్రాంతంపై మమకారం లేదన్నారు. అందుకే రాయలసీమ ప్రజలు 52 స్థానాల్లో కేవలం మూడు స్థానాలకు టీడీపీని పరిమితం చేశారన్నారు.