అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన భారతి ఇటీవల ఎస్కేయూ స్నాతకోత్సవంలో గవర్న ర్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకున్నారు. తన కుటుంబంతో కలసి రేకుల షెడ్డులో నివసిస్తున్న ఆమె దీన పరిస్థితిపై మీడియాలో కథనాలు వచ్చా యి. ఈ నేపథ్యంలో ఆమెను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సోమవారం అనంతపురం కలెక్టర్ గౌతమి ఆమెను కలెక్టరేట్‌కు పిలిపించారు. భూమి పట్టాను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ... సాకే భారతి జిల్లాకే గర్వకారణమని ప్రశంసించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమెకు 2 ఎకరాల భూమి, లెక్చరర్ పోస్టు ఇచ్చామని తెలిపారు. భారతి అంగీకరిస్తే ఆమె చదివిన ఎస్కేయూలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇస్తామన్నారు.