ఉత్తరప్రదేశ్ వైద్యులు 13 నెలల చిన్నారి కడుపులో నుంచి కిలోన్నర బరువున్న పిండాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. లఖ్ నవూలోని సిద్ధార్థ నగర్ కు చెందిన షాజాద్ ఆలం, రహీమా దంపతులకు 13 నెలల కుమార్తె ఉంది. చిన్నారి కడుపు వాపుతో బాధ పడుతుండగా ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కింగ్ జార్జ్ యూనివర్శిటీని సంప్రదించారు. అక్కడి వైద్యులు 3 గంటలు శ్రమించి పిండాన్ని తొలగించారు.