అమృత్ భారత్ పథకం కింద వాల్తేర్ డివిజన్ లోని పలు రైల్వేస్టే షన్లను ఉన్నతీకరించనున్నట్లు (అప్ గ్రెడేషన్) వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ. కె. త్రిపాఠి గురువారం తెలిపారు. ప్రస్తుతం విజయనగరం, దువ్వాడ, దమంజోడి స్టేషన్లలో ఆయా పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమృత్ భారత్ కు వాల్తేర్ డివిజన్లో 15 స్టేషన్లను గుర్తించారన్నారు. మొదటి దశలో మూడింటిలో పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.