సింహాద్రిపురం నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్ సర్వీసును నూతనంగా ప్రారంభించినట్లు పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సర్వీస్ గురువారం నుంచి ప్రారంభించినట్లు డీఎం తెలిపారు. కాగా ఈ బస్. సర్వీస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు సింహాద్రిపురంలో బయలుదేరి పులివెందుల, కదిరి మీదుగా బెంగళూరు వెళ్తుందన్నారు. ఈ సర్వీస్ కు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ వెసులుబాటు కల్పించినట్లు డీఎం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa