సాయి ధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా లెక్క తేల్చేదాకా తగ్గేదేలే అని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘నేను చేసినవి ఆరోపణలే అయితే.. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు.