సినిమాను సినిమాలాగే చూడాలంటున్నాడు ఈ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలను సినిమాగానే తీయండి. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు? అని మంత్రి అంబటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... మమ్మల్ని గోకితే .. ఇలానే ఉంటుంది. నా మీద పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసుకోండి.. నాకేం అభ్యంతరం లేదు. అందులో సాయిధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ను పెట్టి.. విశ్వప్రసాద్ తో తీయించండి. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల గురించి నేను పట్టించుకోలేదు. మీ సినిమాలు మీరు తీసుకుంటే ఏమీ ఉండదు. మమ్మల్ని గోకితే ఇలానే ఉంటుంది. ఇదే ఈ కథలో నీతి అని తెలిపారాయన. ఇక అంబటి ఢిల్లీ పర్యటన గురించి, దానికి బ్రో చిత్ర వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ నేను ఢిల్లీ ఎందుకు వెళ్తున్నానో చెప్పను. ముఖ్యమైన అంశం మీద వెళ్తున్నా. అక్కడ మా పార్టీ ఎంపీలను కలుస్తా’’ అని సమాధానం ఇచ్చారు.