గాజువాక పంతులుగారి మేడ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యురాలు భవ్య (25) మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతురాలు సోంపేట సమీపంలో గల బట్టిగళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణిగా విధులు నిర్వహిస్తుంది. కాగా పరీక్ష నిమ్మితం అనంతపురంలోని వారి బంధువులు అయినా మనీషాతో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుకనుంచి లారీ డీ కొనడంతో గాయాలపాలైన ఆమెని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.