అమెరికాలోని మెయినీకి చెందిన మార్జోరీ పెర్కిన్స్ (87) తన ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఓ దొంగ చొరబడ్డాడు. మార్జోరీపై దాడి చేసే క్రమంలో ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. అప్పుడా దొంగ తనకు ఆకలిగా ఉందని చెప్పడంతో వెంటనే ఆమె బాక్స్‌లో దాచిన ఆహారాన్ని తీసి అందించింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు రావడంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa