దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ధృవీకరించిన ఏడీజీపీ కశ్మీర్ విజయ్ కుమార్, గాయపడిన సైనికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, ఈ మధ్యాహ్నం శ్రీనగర్ పోలీసులు టిఆర్‌ఎఫ్‌కు చెందిన ముగ్గురు సహచరులను అరెస్టు చేశారు. వారిని బారాముల్లాకు చెందిన ఇమ్రాన్ నజర్, కమర్వారీకి చెందిన వసీం మట్టా, బిజ్‌బెహరాకు చెందిన వకీల్ భట్‌గా గుర్తించారు. వారి నుంచి మూడు గ్రెనేడ్లు, 35 లైవ్ రౌండ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.