మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో 34 ఏళ్ల గిరిజన వ్యక్తి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కుమారుడు తనపై కాల్పులు జరపడంతో ఆసుపత్రి పాలయ్యాడు. 40 ఏళ్ల వివేకానంద్ వైశ్య బీజేపీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు. ఈ ఘటన గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గుడి సమీపంలోని ఇరుకైన రోడ్డుపై వివేకానంద్ కొంత మంది వ్యక్తులతో వాగ్వాదానికి దిగాడు. సూర్య కుమార్ ఖైర్వార్ అనే గిరిజనుడు ఆ గుంపులో చేరి వైశ్యతో వాగ్వాదానికి దిగాడు.వివేకానంద్ సూర్య కుమార్‌పై కాల్పులు జరపగా, బుల్లెట్ అతని కుడి మణికట్టుకు తగిలింది.