రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినేమేనిఫెస్టో పథకాలపై అనంతపురం జిల్లా, ధర్మవరం మండలంలోని బిల్వంపల్లి, నేలకోట, పంచాయతీలలో శుక్రవారం టీడీపీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే మహిళలకు సంక్షేమ పథకాలు ఎక్కువగా అందాయన్నారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రానున్న ఎన్నికలలో ప్రజలందరూ టీడీపీ పార్టీని ఆదరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa