ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానిస్టేబుల్ కొడుకువై ఉండి దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో,,అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2023, 10:38 PM

కానిస్టేబుల్ కొడుకువై ఉండి, పోలీసులను గాయపరిచిన దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో అంటూ పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను జనసేనాని పవన్ కల్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే. పుంగనూరులో జరిగిన పరిణామాలు అధికార పార్టీ హింసా ప్రవృత్తిని చాటేలా ఉన్నాయని పవన్ విమర్శించారు. మరోవైపు, టీడీపీ కార్యకర్తలే పోలీసులపై దాడి చేసి, వారిని గాయపరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పుంగనూరు ఘటనల్లో చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా పవన్ వ్యాఖ్యలు చేయడాన్ని అంబటి ఖండించారు. "కానిస్టేబుల్ కొడుకువై ఉండి, పోలీసులను గాయపరిచిన దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో!" అంటూ పవన్ ను అంబటి ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com