తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు మరోసారి సత్తా చాటారు. ఈ నెల 29నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరిగే అండర్ 18 మహిళల ఆసియా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీకి ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థినులు రాణి, ఇందు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరిద్దరూ భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ప్రస్తుతం ఇందు (ఆర్మూర్), రాణి (సుద్దపల్లి) గురుకుల సాఫ్ట్‌బాల్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నారు.