ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని టిడిపి నేతలకు సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సవాల్ విసిరాడు. ఒంగోలు లోని వైసిపి కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఆర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు.