పోలవరం నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు అంటూ మోసం చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తాను సీఎం అయినప్పటి నుంచి ఏటా గడువు పెంచుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు 2025 నాటికి పోలవరం పూర్తవుతుందని చెబుతున్నారని, 2025 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారా? అని ఎద్దేవా చేశారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం పోలవరం పూర్తి కాదన్నారు.