కర్నూలు జిల్లా, హాలహర్వి మండలం చింతకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బళ్ళారి ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. మృతులు కర్నాటక రాష్ట్రానికి చెందిన శిడిగనమల నుంచి మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa