అనంతపురం జిల్లా ఏ. ఆర్ కానిస్టేబుల్ యు. కిరణ్ కుమార్ మృతికి కారణమైన రోడ్డు ప్రమాద ఘటనా స్థలిని గురువారం అనంతపురం రేంజ్ డి. ఐ. జి ఆర్ ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు లు పరిశీలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. వేగ నియంత్రణ కోసం ఆ ప్రాంతంలోని రోడ్డుకు అటు ఇటు వాహనాలు తిరగకుండా ఐరన్ బ్యారికేడ్స్ తో మూయించాలని ఆదేశించారు.