తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ భేటీ అయినట్లు సమాచారం. పార్టీ మార్పు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడుని కలిసిన అనంతరం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. తనకు భద్రత కల్పించాలని చంద్రబాబును కోరినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నుంచి తనకు లభించిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారో త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఆమె ఆ తర్వాత తెలంగాణకు వెళ్లారు.