పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో పోలింగ్ బూత్ నంబర్ 218 పరిధిలో బీఎల్వో ప్రకాష్ రెడ్డి ఓటరు పరిశీలన చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ బోయ కంబగిరి, టీడీపీ నేతలు ముక్కన్న, మునెప్ప, యంకన్న పాల్గొన్నారు.