తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాదచారులపైకి టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. కుదువాంచేరి సమీపంలోని పోతేరి వద్ద కొందరు రోడ్డు దాటేందుకు యత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa