ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీచేసింది. రిజాయిండర్ దాఖలకు అభిషేక్ బోయినపల్లికి రెండు వారాల సమయం ఇచ్చింది. కేసు విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసింది.