అలిపిరి నడక దారిలో ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతిచెందడం బాధాకరమని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అన్నారు. రెండు కాలిబాటలను 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై టీటీడీ ఛైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నడక దారిలో ప్రతి 10 మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామన్నారు. చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.