గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రుషికొండపై దేవుడు ఉండాలి..నేరగాళ్లు కాదని సీఎం జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు . సీఎంగా జగన్ను మరో 6 నెలలు భరించాలన్నారు. 'వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి. ప్రజల మద్దతు లేకుంటే నేనేం చేయలేను. నాకు అండగా ఉంటే విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తా’ అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ తన రూ.300 కోట్ల ఆస్తులు కాపాడుకోవడం కోసం లక్ష కోట్ల విలువైన ప్రజల ఆస్తులను వదిలేసి తెలంగాణ నుంచి వచ్చేశాడని విమర్శించారు. తాను పూర్తిగా మంగళగిరికి మారానని, విశాఖను రెండో ఇల్లుగా మార్చుకుంటానని చెప్పారు. ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడతానని వ్యాఖ్యానించారు.