ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని కలెక్టర్ ఢిల్లీరావు సోమవారం తెలిపారు. ఆగస్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న నేపథ్యంలో, కార్యక్రమ ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా స్థాయి అధికారులు పర్య వేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నేటి స్పందన రద్దు చేశామన్నారు.