184 రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఫుడ్, కార్యక్రమాల కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న టీడీపీ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌పై పుంగనూరు అంగళ్లులో కేసు నమోదు అయ్యింది. అసలు స్పాట్లోనే లేని వ్యక్తిపై కేసు ఎలా పెడతారంటూ తెలుగు దేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. యువగళంలో ఉన్న నేత అంగళ్లు వెళ్లి రాళ్లు వేసాడంటూ కేసు పెట్టడం పోలీసుల స్వామి భక్తికి పరాకాష్ట అంటూ నేతలు మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులతో పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.