ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ, జనసేనలు కూడా బీజేపీకు అనుకూలంగా ఉన్నాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 05:08 PM

ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ రిలయెన్స్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ కేసులకు భయపడి బీజేపీకు అనుకూలంగా పనిచేస్తున్నారని, అలాగే టీడీపీ, జనసేనలు కూడా బీజేపీకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో చర్చ జరిగినప్పుడు వైసీపీ, టీడీపీలు మాట్లాడకపోవటం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకు తాకట్టుపెట్టారన్నారు. బీజేపీతో జనసేన కలిసి ఉంటే గత ఎన్నికల్లో వచ్చిన పలితాలే పవన్‌కు వస్తాయని జోష్యం చెప్పారు. జనసేన బీజేపీని వీడితే పవన్ కళ్యాణ్‌కు జనం బ్రహ్మరథం పడతారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com