చిత్తూరు నగర పరిధిలోని గంగనపల్లెలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మద్ధయ్యచ్చారి వివరాల మేరకు.. గంగనపల్లెకు చెందిన ప్రమీల కుమార్తె సుగుణ(30), గుడిపాల మండలం 190 రామాపురంకు చెందిన మహే్షను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వారి కుటుంబం కూడా గంగనపల్లెలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వివాహం అయినప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచూ కుటుంబ విషయాల్లో ఘర్షణలు జరుగుతుండేవని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుగుణ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు సీఐ తెలిపారు. మృతురాలి తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.