ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ సమైక్యతను చాటుతూ జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన కళాకారులు, విద్యార్థులు విజయనగరంలో సోమవారం ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. నా భూమి -నా దేశం కార్యక్రమంలో భాగంగా మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల -సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. జాతీయ స్ఫూర్తిని చాటుతూ దేశభక్తి నినాదాలు చేస్తూ కళాకారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa