నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘మీరు భవనం పేరు మార్చవచ్చు. కానీ చరిత్రలో ఇమిడిపోయిన పండిట్ నెహ్రూ పేరును మాత్రం మార్చలేరు. మహాత్మా గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సావర్కర్ జీ సృష్టించిన చరిత్రను మీరు మార్చలేరు. మీరు వారిలాంటి చరిత్రను సృష్టించలేరు కాబట్టి పేర్లు మారుస్తున్నారు’ అని మండిపడ్డారు.