ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారదర్శకత, నమ్మకంతో రమేష్ హాస్పిటల్స్ 35 సంవత్సరాల ప్రయాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2023, 09:58 AM

1988వ సంవత్సరంలో ఆగస్టు 15న అరుపడకలతో, విజయవాడ నగరంలో మొట్టమొదటి గుండెజబ్బుల ఆస్పత్రిగా ఏర్పాటుచేసిన రమేష్ హాస్పిటల్స్ 750 పడకలతో కోస్టల్ కారిడార్ లో విస్తరించి సంతృప్తికరమైన,నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ 35 వసంతాలు పూర్తి చేసుకుంది.


వార్షికోత్సవ సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి మాట్లాడుతూ గడచిన 35 సంవత్సరాలలో 20 లక్షల మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని " "ఆరోగ్య భాగ్యం" అనే పథకం ద్వారా ఇన్ పేషెంట్ మరియు ఔట్ పేషెంట్ వైద్య సేవలపై 25% రాయితీలను అందించడానికి నిశ్చయించామని తెలియజేశారు.


భవిష్యత్ ప్రణాళికల గురించి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ దేవానంద్ వివరిస్తూ ఆస్టర్ డి.ఎం.హెల్త్ కేర్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు సంవత్సరాలలో మరో 800 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ ను విస్తరిస్తున్నామని దానిలో ప్రధానంగా విజయవాడ నగరంలో400 పడకలతో క్రొత్త యూనిట్ ను క్యాన్సర్,ట్రాన్స్ ప్లాంట్ మరియు మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని గ్రూప్ లో ఉన్న గుంటూరు,ఒంగోలు మరియు విజయవాడ లో ఉన్న మూడు హాస్పిటల్స్ నందు క్యాన్సర్ వైద్య సేవలను త్వరలో అందుబాటులోనికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలియజేశారు.వివిధ ప్రాంతాలలో ఐ సి యు, ఎమర్జెన్సీ రూమ్ నందు ఉన్న రోగులను అధునాతన కెమెరాలు,వైద్య పరికరాలతో 24 గంటలూ మానిటర్ చేయడానికి "క్లౌడ్ డాక్స్" అనే ప్రత్యేక సెంట్రల్ కమాండ్ స్టేషన్ ను అందుబాటులోనికి తీసుకువచ్చామని ఈ వ్యవస్థ ద్వారా టెలి ఐ సి యు,టెలి ఎమర్జెన్సీ రూమ్, టెలి అంబులెన్స్ వైద్య సేవలను రమేష్ హాస్పిటల్ క్లస్టర్ నందు ఉన్న అన్ని హాస్పిటల్స్ కు అనుసంధానం చేయడం ద్వారా నాణ్యమైన వైద్య సర్వీసులు ఇన్ పేషంట్ రోగులకు అందిస్తున్నామని విజయవంతమైన ఈ విభాగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అవసరం అయిన వారికి ఈ సేవలను అందించడానికి నిర్ణయించామని తెలియజేశారు.5 జి నెట్ వర్క్ తో రోగిని అంబులెన్స్ లో నుంచే క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో దారి పొడుగునా అత్యవసర వైద్యం అందించే విధంగా అధునాతనమైన నాలుగు అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు.


గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్.వై. కార్తీక్ చౌదరి మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా అంతర్జాతీయస్థాయిలో అనేక అత్యాధునిక వైద్య పరికరాలను ఈ ప్రాంతానికి మొట్ట మొదటిసారిగా అందుబాటులోనికి తీసుకు వచ్చామని, నడుపుతున్న అన్ని హాస్పిటల్స్ కూడా అంతర్జాతీయ మరియు జాతీయ నాణ్యతా ప్రమాణ సంస్థల గుర్తింపు కలిగి పారదర్శకత,జవాబుదారీ తనంతో వైద్యం అందిస్తున్నామని సామాజిక బాధ్యతగా ఇప్పటి వరకు ఒక లక్ష మంది ప్రజలకు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ ఇచ్చామని రెండు దశాబ్దాలుగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కూడా సేవలు అందుబాటులోనికి తీసుకు వచ్చామని తెలియచేశారు. 300 రూపాయల విలువ కలిగిన ఆరోగ్య భాగ్యం కార్డ్ ను నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి షేక్ సజీల ఆవిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com